Dairector V.N.Aditya : 'స్టాలిన్'తో పోటీగా నాగార్జున సినిమా విడుదల చేసి నష్టపోయాం

by Pulgam srinivas |

Dairector V.N.Aditya : స్టాలిన్ మూవీతో పాటే బాస్ చిత్రం విడుదలైంది. ఆ సమయంలో విడుదల వద్దని చాలామంది చెప్పారు. కానీ వినకుండా రిలీజ్ చేశారు. చివరకు స్టాలిన్ ఎఫెక్ట్‌తో బాస్ మూవీకి నష్టాలు వచ్చాయని ఈ దర్శకుడు చెప్పుకొచ్చారు.

Dairector V.N.Aditya : స్టాలిన్తో పోటీగా నాగార్జున సినిమా విడుదల చేసి నష్టపోయాం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును పొందిన దర్శకులలో వి.ఎన్. ఆదిత్య గారు ఒకరు. ఈయన ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా చిరంజీవి, నాగార్జున సినిమాలు రెండు సార్లు పోటీ పడిన సందర్భంలో ఏం జరిగింది అనే విషయాలను ఆయన తెలియజేశారు.

వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ... నా దర్శకత్వంలో రూపొందిన నేనున్నాను మరియు చిరంజీవి గారు నటించిన ఠాగూర్ సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదలయ్యాయి. కానీ ఠాగూర్ సినిమా సూపర్ సక్సెస్ అయినా కూడా మా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. నేనున్నాను సినిమా సూపర్ కలెక్షన్లను రాబట్టి మంచి లాభాలను కూడా అందుకుంది. ఆ చిత్రం ఆ సమయంలోనే 10 నుండి 10.5 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఆ తర్వాత చిరంజీవి గారు హీరోగా నటించిన స్టాలిన్ మూవీతో పాటు నా దర్శకత్వంలో నాగార్జున గారు హీరోగా నటించిన బాస్ సినిమా విడుదల అయింది. ఆ సినిమా విడుదలకు ముందు నాగార్జున అభిమానులు ఈ సమయంలో సినిమా వద్దు అన్నారు. కానీ చాలామంది వినకుండా విడుదల చేశారు. అలా విడుదల చేయడం వల్ల బాస్ మూవీకి చాలా నష్టాలు వచ్చాయి. స్టాలిన్ సినిమా బాస్ మూవీ కలెక్షన్లపై చాలా పెద్ద స్థాయిలో ప్రభావాన్ని చూపింది. కొన్నిసార్లు నిర్మాతలు కూడా సరిగ్గా ఆలోచించుకోలేరు, నష్టాలను భరించాల్సి వస్తుందని ఆయన తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

Next Story