Vignesh Shivan:‘ఆ విషయంలో రాజీ పడాలనుకోలేదు’.. లేడీ సూపర్‌స్టార్ భర్త కీలక వ్యాఖ్యలు..!

by Kodari Anjali |

లేడీ సూపర్‌స్టార్ నయనతార(Lady Superstar Nayanthara) భర్త.. దర్శకుడు విఘ్నేశ్ శివన్(Directed by Vignesh Sivan) తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Vignesh Shivan:‘ఆ విషయంలో రాజీ పడాలనుకోలేదు’.. లేడీ సూపర్‌స్టార్ భర్త కీలక వ్యాఖ్యలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్‌స్టార్ నయనతార(Lady Superstar Nayanthara) భర్త.. దర్శకుడు విఘ్నేశ్ శివన్(Directed by Vignesh Sivan) తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఎల్‌ఐకే’(లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ)(Love Insurance Company) గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సినిమాలో ఫస్ట్ హీరో రోల్ కోసం శివ కార్తికేయన్‌(Shiva Karthikeyan)ను తీసుకోవాలని చూశామని అన్నారు. కానీ పలు కారణాల వల్ల ఆ నటుడ్ని తీసుకోలేకపోయామని తెలిపాడు. కానీ ఎల్‌ఐకే స్టోరీ మొత్తం భవిష్యత్తుకు సంబంధించిన సీన్స్ ఉంటాయని తెలిపారు.

కానీ బడ్జెట్ ఎక్కువవుతుందని ప్రొడ్యూసర్లు(Producers) కాస్త ఆందోళనగా ఉన్నారని అన్నారు. స్టోరీలో పలు మార్పులు చేస్తే బాగుంటుందని అన్నారని తెలిపాడు. కానీ ఆ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడలేదని విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడో తెరకెక్కిన బాహుబలి(Bahubali) సినిమాను ఇప్పుడు తీయమంటే ఎలా రూపొందిస్తారని.. ఇది కూడా అంతేనని చెప్పానని వెల్లడించారు. ఫ్యూచర్(future) గురించి రాసుకున్న స్టోరీని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించాలంటే ఎలా కుదురుతుంది? అని దర్శకుడు వివరించాడు.

లైఫ్‌కు ఇన్సూరెన్స్(Life insurance) ఉంటుంది. కానీ లవ్ కు ఉండే ఇన్సూరెన్స్ గురించి ఎల్‌ఐకే సినిమాలో చూపిస్తామని అన్నారు. లవ్ కోసం ఫోన్‌ గాడ్జెట్‌(Gadget)ను వాడి.. 2035 వరకు టైమ్ ట్రావెల్ చేసే పర్సన్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు కొత్తగా తీసుకురానున్నామని పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో విఘ్నేష్ సతీమణి.. ప్రముఖ హీరోయిన్ నయనతార(Nayanthara) కూడా కనిపించనుందట. ఇక ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ చిత్రానికి అనిరుధ్(Anirudh) సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Next Story