ఈ సారి సరికొత్త మమితను చూస్తారు.. దర్శకుడు విఘ్నేష్ రాజా వైరల్ కామెంట్స్

by Chukka Sudharani |

కారా సినిమాతో మమిత బైజులోని కొత్త కోణాన్ని చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ విఘ్నేష్ రాజా.

ఈ సారి సరికొత్త మమితను చూస్తారు.. దర్శకుడు విఘ్నేష్ రాజా వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ ధనుష్.. ప్రస్తుతం ‘కారా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కె. గణేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజగా ఇందులో ధనుష్ సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో మమిత డీ-గ్లామరస్‌గా కనిపించి అందరిని షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ విఘ్నేష్ మమిత పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘మమిత ఇంతకుముందు డ్యూడ్, ఫీల్-గుడ్ తరహా సినిమాల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన గనాన్ని సంపాదించుకుంది. అయితే ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో గ్లామర్ అంశాలు ఏమాత్రం ఉండవని నేను ఆమెకు స్పష్టంగా చెప్పాను. ఆమె తనను తాను పూర్తిగా ఒక రామనాథపురం పల్లెటూరి అమ్మాయిగా మార్చుకుంది. మేకప్ నుండి దుస్తుల వరకు, ఒక నిజమైన పల్లె మహిళలా కనిపించడానికి, ఆ భావనను సొంతం చేసుకోవడానికి మమిత ఎంతో కృషి చేసింది. కేవలం నటనలో మాత్రమే కాదు, ఆ పాత్రలోని భావోద్వేగ గాఢతను, ఆమె పడే కష్టాలను తెరపై ఆవిష్కరించడంలోనూ తను అద్భుతంగా రాణించింది. మమిత తన నటనతో మీ మనసులను నిజంగా కదిలిస్తుంది. కారా సినిమాతో ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని మమిత యొక్కసరికొత్త రూపం చూడబోతున్నా’ అని తెలిపాడు.


Next Story