మంగ్లీ వివాదంలో నా పాత్ర లేదు: దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన

by Gantepaka Srikanth |

ప్రముఖ సింగర్ మంగ్లీ చుట్టూ ముసురుకున్న వివాదంలో తన పేరు వినిపించడంపై టాలీవుడ్ దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు.

మంగ్లీ వివాదంలో నా పాత్ర లేదు: దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ మంగ్లీ చుట్టూ ముసురుకున్న వివాదంలో తన పేరు వినిపించడంపై టాలీవుడ్ దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు తన పేరును ఈ ఇష్యూలోకి లాగడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగ్లీపై నమోదైన కేసులో గానీ, ఆ వివాదంలో గానీ తన ప్రమేయం ఏమాత్రం లేదని వేణు ఊడుగుల తేల్చి చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలు తనను మానసిక వేదనకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మంగ్లీ, న్యాయవాది సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వ్యక్తులే. ఆ పరిచయం ఉండటం వల్లే కావాలని నన్ను ఈ ఇష్యూలోకి లాగారు. అంతకు మించి ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని ఆయన వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాసే ముందు కనీస నిజానిజాలు తెలుసుకోవాలని మీడియా ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. నిరాధారమైన ఆరోపణలతో తన పేరును ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు.

Next Story