- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Venky Kudumula: రష్మికను తీసేసి శ్రీలీలను తీసుకోవడానికి కారణం అదే.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithin) నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’.

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithin) నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేNithinకర్స్ (Mythry Movie Makers) బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ఫస్ట్ సింగిల్‌కు కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ఫస్ట్ ఈ సినిమాలో శ్రీలీలకు బదులు రష్మిక మందన్నా (Rashmika Mandanna)ను హీరోయిన్‌గా అనుకుని.. ఫైనల్‌గా శ్రీలీలను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు మేకర్స్.
అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న డైరెక్టర్ వెంకీ కుడుమలను.. ‘అసలు రష్మికను తీసేసి శ్రీలీలను తీసుకోవడానికి కారణం ఏంటని’ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన డైరెక్టర్.. ‘మా సినిమా ఒప్పుకునే టైంకి రష్మికకు హిందీలో రెండు చిత్రాలతో పాటు.. పుష్ప కూడా ఉంది. ఇక ఎప్పుడైతే మేము టేడ్స్ ఇస్తున్నామో.. సేమ్ డేట్స్ మిగతా మూవీస్‌కు కూడా ఉన్నాయి. రెండు రోజులు, మూడు రోజులు షెడ్యూల్ ప్లాన్ (Schedule Plan) చేసుకుంటే అది ఎవరికి సెట్ కాదు. సరే ఇక ఈ సినిమా వరకు డ్రాప్ అవుదాం అని అనుకున్నాము. మేము అందరం కలిసి తీసుకున్నా నిర్ణయం ఇది’ అంటూ చెప్పుకొచ్చాడు.






