- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల కొండపై ‘విశ్వంభర’ మూవీపై సెన్సేషనల్ అప్ డేట్ ఇచ్చిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), డైరెక్టర్ వశిష్ట (Director Vashishta)కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara).

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), డైరెక్టర్ వశిష్ట (Director Vashishta)కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara). ఈ సోషియోఫాంటసీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ వశిష్ట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ మేరకు విశ్వంభర రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇచ్చారు.
‘‘విశ్వంభర’ సినిమా చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రిలీజ్ డేట్ త్వరలో చెప్తాము.. ఇంకా టైం ఉంది. ప్రజెంట్ విశ్వంభరతో బిజీగా ఉన్నాను కాబట్టి.. మరో సినిమా గురించి ఆలోచన లేదు’ అని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), అషిక రంగనాథ్(Ashika Ranganath), ఇషా చావ్లా(Isha Chawla), సురభి(Surabhi), కునాల్ కపూర్(Kunal Kapoor) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే.. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనప్పటికీ సమ్మర్ స్పెషల్‌గా మే 09 న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.






