- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
National Award: తొలి సినిమాతోనే సత్తా చాటిన సుకుమార్ కూతురు
తొలి సినిమాతోనే సత్తా చాటిన సుకుమార్ కూతురు

దిశ, వెబ్‌డెస్క్: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలను కేంద్రం(National Awards) ప్రకటించింది. డైరెక్టర్ సుకుమార్ కూతురు సుక్రతి(Sukriti Sukumar)కి నేషనల్ అవార్డు లభించింది. ఉత్తమ బాలనటిగా ఎంపికైంది. గాంధీ తాత చెట్టు(Gandhi Tatha Chettu) సినిమాకు గాను ఈ అవార్డు లభించింది. సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్, రవిశంకర్ నిర్మించారు. మల్లాది పద్మావతి దర్శకత్వం వహించారు. అలాగే.. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని అవార్డు వరించింది. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో ‘హను-మాన్’ చిత్రం అవార్డు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్’కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు ఉత్పల్ దత్త (అస్సామీ)కు ప్రకటించారు. తొలుత నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి అవార్డులను వెల్లడించారు.






