ఫ్యాన్స్‌కు పండుగ.. వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-30 13:54:03  IST  )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు దర్శకుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమా విడుదల తేదీని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు.

ఫ్యాన్స్‌కు పండుగ.. వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు దర్శకుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమా విడుదల తేదీని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రామాయణంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నట్లు రాజమౌళి గతంలోనే చెప్పారు. గతేడాది నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో.. ఈ సినిమాలో మహేష్ రాముడిగా కనిపిస్తాడని క్లారిటీ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. సుమారు రూ.1300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా టీజర్లో చూపించిన స్థలాలు, విగ్రహాలు సినీ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా త్రేతాయుగంతో లింక్ పెట్టడంతో సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ అండ్ షోయింగ్ బిజినెస్ నిర్మిస్తోన్న వారణాసికి ఎంఎం కీరవాణికి సంగీతం అందిస్తున్నారు.

Next Story