‘ది ప్యారడైజ్’ మూవీ స్టోరీ లీక్.. చేసింది ఎవరో కాదు..!

by Chukka Sudharani |

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ (The Paradise)ఒకటి.

‘ది ప్యారడైజ్’ మూవీ స్టోరీ లీక్.. చేసింది ఎవరో కాదు..!
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ (The Paradise)ఒకటి. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. ‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబోలో మరోసారి సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌లో కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్నడ‌, బెంగాలీ, ఇంగ్లీష్‌, స్పానిష్ భాష‌ల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ది ప్యారడైజ్’ నుంచి గ్లింప్స్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ‘ది ప్యారడైజ్’ చిత్రంపై సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ఇందులో నాని రెండు పిలకలు వేసుకుని దర్శనమివ్వడంతో.. ఆ లుక్‌ను ట్యాగ్ చేస్తూ ‘యుగానికి ఒక్కడు’ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్‌తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందిస్తూ.. ‘గ్లింప్స్‌లో కనపడిన నాని రెండు జడలకు తన బాల్యానికి కనెక్షన్ ఉంటుంది. చిన్నప్పుడు తల్లి అలాగే జడలు వేసి పెంచేది.. ఆ ఇన్స్‌స్పిరేషన్‌తోనే నాని పాత్ర డిజైన్ చేశాము’ అని చెప్పుకొచ్చారు.

Next Story