SVSC: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్వీకెల్ ప్రకటించిన డైరెక్టర్.. కానీ హీరోల విషయంలో బిగ్ ట్విస్ట్!

by Chukka Sudharani |

విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

SVSC: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్వీకెల్ ప్రకటించిన డైరెక్టర్.. కానీ హీరోల విషయంలో బిగ్ ట్విస్ట్!
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). కుటుంబ విలువలు, అనుబంధాలను అందరికి అర్థం అయ్యేల రూపొందిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీవేకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిరించగా.. శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించారు. ఈ మూవీ 2013లో సంక్రాంతి కానుకగా వచ్చి మిక్సిడ్ టాక్ అందుకుంది. కానీ, ఇటీవల రీరిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు డైరెక్టర్. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘SVSC’ సీక్వెల్ (SVSC sequel) తీసుకురావాలి అనుకుంటున్నాము. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ (Script work) నడుస్తోంది. అయితే.. ఈ సీక్వెల్‌లో విక్టరీ వెంకటేశ్, మహేష్ బాబు ఉండకపోవచ్చు’ అని అన్నారు. కాగా.. SVSC సినిమా అంటేనే మొదటగా గుర్తోచ్చేది పెద్దోడు (వెంకటేశ్), చిన్నోడు (మహేశ్ బాబు). మరి ఈ స్టార్ హీరోలు కాకుండా ఇప్పుడు ఈ సీక్వెల్‌లో ఏ హీరోలను పెడతాడు డైరెక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story