- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ ఇషా రెబ్బపై చేయిచేసుకున్న తరుణ్ భాస్కర్
టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బపై డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ చేయిచేసుకున్నారు. ఈ విషయాన్ని ఓం శాంతి ఓం డైరెక్టర్ సంజీవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాలో తరుణ్, ఇషా కలిసి నటిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బపై డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ చేయిచేసుకున్నారు. ఈ విషయాన్ని ఓం శాంతి ఓం డైరెక్టర్ సంజీవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాలో తరుణ్, ఇషా కలిసి నటిస్తున్నారు. అయితే సినిమాలో చాలా సన్నివేశాల్లో హీరో హీరోయిన్ పై చేయి చేసుకుంటాడు. అంతే కాకుండా హీరోయిన్ సైతం హీరోను కొడుతుంది. కాగా ఓ సన్నివేశంలో తరుణ్ ఓ సన్నివేశంలో నిజంగానే ఇషా రెబ్బను కొట్టారని చెప్పారు.
ఇషా చెంపకు చెట్నీ అంటుకునే కొట్టాలని తరుణ్ కు చెప్పానని దీంతో సన్నివేశంలో పర్ఫెక్షన్ కోసం తరుణ్ నిజంగానే కొట్టారని చెప్పారు. అప్పుడు ఇషా కూడా నిజంగానే కొట్టావ్ అని చెప్పిందన్నరు. దానికి సారీ చెప్పామని మరీ గట్టిగా కాకుండా కాస్త బలంగా కొట్టాడని అన్నారు. సినిమా తీసేటప్పుడు ఫైట్ సీన్లు, ఇతర సన్నివేశాల్లో ఇలాంటివి జరగటం సహజం అని చెప్పారు. ఇదిలా ఉంటే తరుణ్ భాష్కర్, ఇషా రెబ్బ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తరుణ్ కానీ ఇషా కానీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ అనేక సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ వార్తలు మొదలయ్యాయి.






