Kubera : మాస్ స్టెప్పులేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల

by Muthe.Rajitha |   (  Updated:2025-04-25 12:28:19  IST  )

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూల్ గా, సింప్లిసిటీగా ఉండే డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Director Shekhar Kammula). అలాంటి కామ్ డైరెక్టర్ మాస్ స్టెప్పులు వేసి, ప్రేక్షకులను అలరించారు.

Kubera : మాస్ స్టెప్పులేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూల్ గా, సింప్లిసిటీగా ఉండే డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Director Shekhar Kammula). అలాంటి కామ్ డైరెక్టర్ మాస్ స్టెప్పులు వేసి, ప్రేక్షకులను అలరించారు. శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం 'కుబేర'(Kubera). ఈ మూవీ నుంచి ఆదివారం ఫస్ట్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్(DSP) కంపోజ్ చేసిన "పోయిరా మావా.."(Poyira Mava) అంటూ సాగే ఈ సాంగ్ ను స్వయంగా ధనుష్ పాడారు. అయితే ఈ సాంగ్ విడుదల సందర్బంగా శేఖర్ కమ్ముల చిత్ర యూనిట్ తో కలిసి డాన్స్ చేశారు.

డాన్స్ అంటే ఏదో కాలు చెయ్యి కదపడం కాదు.. మాస్ స్టెప్పులు వేసి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. చిత్రబృందం అంతా తీన్మార్ స్టెప్పులు వేస్తూ.. ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక(Rashmika Mandanna) నటిస్తుండగా.. నాగార్జున(Nagarjuna), నాజర్ వంటి పలువురు ముఖ్య నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Next Story