తలైవాకు విలన్‌గా డైరెక్టర్ శంకర్!

by Chukka Sudharani |

రజినీకాంత్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘తలైవార్173’ కోసం సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

తలైవాకు విలన్‌గా డైరెక్టర్ శంకర్!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జైలర్ 2’తో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘తలైవార్173’ కోసం సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ నిర్మాణంలో ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఈ చిత్రం రాబోతున్నది. మొదట ఈ మూవీకి సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు రాగా.. ఫైనల్‌గా ఈ ప్రాజెక్టు ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి చేతిలోకి వెళ్లింది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్టేట్ ఒకటి వైరల్ అవుతున్నది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం డైరెక్టర్ శంకర్‌ను సంప్రదించగా.. ఆయన ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అలాగే డైరెక్టర్ సిబి ఈ సినిమా పనులు మొదలుపెట్టగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. కాగా.. ఇందులో నిర్మాత కమల్ హాసన్ కూడా ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.

Next Story