Shailesh Kolanu: యూట్యూబ్ థంబ్నెయిల్ మీదా ఘోరమైన బూతులు రాస్తున్నారు.. సంస్కృతి ఎటుపోతుంది అంటూ స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

‘హిట్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh Kolanu).

Shailesh Kolanu: యూట్యూబ్ థంబ్నెయిల్ మీదా ఘోరమైన బూతులు రాస్తున్నారు.. సంస్కృతి ఎటుపోతుంది అంటూ స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘హిట్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh Kolanu). ఇక మొదటి మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ‘హిట్-2’, ‘సైంధవ్’ మూవీస్ చేశాడు. ఇక రీసెంట్‌గా హిట్-త్రీ(Hit-3)తో వచ్చి హిట్ అందుకున్నాడు శైలేష్ కొలను. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమా రివ్యూ క్రిటిక్స్‌(Review Critics)పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘నిజంగా నన్ను ఎక్కువ నిరుత్సాహ పరిచింది యూట్యూబ్ రివ్యూస్. అక్కడ ఉపయోగించే లాంగ్వేజ్ (Language) అస్సలు కరెక్ట్ కాదు. అంటే థంబ్నెయిల్ (YouTube thumbnails) మీదా ఘోరమైన బూతులు పెట్టాల్సి అవసరం ఏం ఉంది. “M... లాగ ఉంది” అని థంబ్నెయిల్స్ పెడుతున్నారు యూట్యూబ్ రివ్యూస్‌లో. మీరే చెప్పండి.. మనకు సంబంధించిన ఒకదాని మీదా అలాంటి థంబ్నెయిల్ చూస్తే ఎలా ఉంటుంది. అసలు మన సంస్కృతి ఎటు పోతుంది. నిజానికి ఒక సినిమా క్రిటిక్‌గా ఫస్ట్ మీ మీదా మీకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అలా పెట్టేముందు కనీసం నిన్ను నువ్వు అయినా రెస్పెక్ట్ చేసుకోవాలి కదా. సినిమా బాగాలేదు అని చెప్పమనండి నాకు ఏం ప్రాబ్లెం లేదు.

కానీ, ఇక్కడ రెండు మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి రివ్యూస్‌లో పీపుల్ యూస్ చేసే లాంగ్వేజ్. సెకండ్ ది వచ్చేసి.. 8:30 కి ఫస్ట్ షో స్టార్ట్ అయితే.. సినిమా కంప్లీట్ అయ్యి ఈ ట్రాఫిక్‌లో ఇంటికి వెళ్లి.. కెమెరా సెట్ చేసుకుని వీడియో చేసుకుని ఎడిట్ చేసి 1pm లేదా 1: 30కి రివ్యూ పోస్ట్ చేసేస్తున్నావు అంటే అసలు నువ్వు నా సినిమా గురించి 10 నిమిషాలు కూడా ఆలోచించడం లేదు అని. రివ్యూ అనేది సినిమాకు ఇచ్చే విశ్లేషణలా ఉండాలి. కానీ, ఒక క్రిటిక్‌గా నువ్వు సినిమా రివ్యూ ఇవ్వడం లేదు.. నా వర్క్‌ను క్రిటిక్ చేస్తున్నావు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story