- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sandeep Reddy Vanga: 6 సంవత్సరాలుగా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. హీరోయిన్ ఫొటో షేర్ చేస్తూ సింబల్స్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా దూసుకుపోతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా దూసుకుపోతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). 2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన ఈయన.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో సంచలనం సృష్టించాడు. దీంతో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే మూవీని బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ (Kabir Singh) అనే టైటిల్‌తో డబ్ చేశాడు. ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీ, నికితా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం.. బాలీవుడ్‌లో కూడా మంచి సక్సెస్ అందుకుంది.
ఈ మూవీ జూన్- 21- 2019న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజై 6 సంవత్సాలు పూర్తి కాగా.. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘కబీర్‌పై 6 సంవత్సరాలుగా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ హీరోయిన్ కియారా అద్వానీ ఉన్న పోస్టర్ రిలీజ్ చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. బాలీవుడ్‌లో ‘యానిమల్’ చిత్రంతో గతేడాది మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో ‘స్పిరిట్’ (Spirit) చేస్తున్నాడు.






