- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సినిమా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా.. కానీ ఈసారి డైరెక్టర్‌గా కాదు
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రివీల్ చేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశారు.

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రివీల్ చేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశారు. అయితే.. ఈసారి ఈయన డైరెక్టర్‌గా కాకుండా సమర్పకుడిగా కొత్త అవతారం ఎత్తారు. ఈ చిత్రంలో ‘మేము ఫేమస్’, ‘గోదారి గట్టు’ ఫేమ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, ‘8 వసంతాలు’ ఫేమ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ జంటగా నటిస్తుండగా.. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేస్తూ.. ‘కథనం చెబుతున్నంత సేపు మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. ఈ వినోదం వెనుక బలమైన భావోద్వేగ స్పర్శ కూడా ఉంది. ఈ చిత్రాన్ని నేను మొదటిసారిగా సమర్పిస్తున్నాను. భద్రకాళి పిక్చర్స్ ఒక విలక్షణమైన మ్యూజికల్ రొమాంటిక్ కామెడీతో మీ ముందుకు వస్తోందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది’ అని ఓ పోస్ట్ షేర్ చేశాడు. కాగా.. ఈ సినిమాకు ‘రోమాంచకం’ అనే టైటిల్ ఫిక్స్ చెయ్యగా.. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జత చేశారు.






