కలర్ ఫోటో ఆ స్టార్ దర్శకుడికి నచ్చలేదు.. ఆఫీసుకు పిలిచి మరీ అలా అన్నారు: సందీప్ రాజ్

by Pulgam srinivas |

సందీప్ రాజ్ మాట్లాడుతూ... రాజమౌళి గారు ఆఫీస్‌కు పిలిచి కలర్ ఫోటో నచ్చలేదని, హీరో పాత్రలో సమస్య ఉందని చెప్పారు. ఆయన చెప్పిన విషయాల వల్ల తదుపరి సినిమాల్లో ఎలాంటి తప్పులు చేయకూడదనే దానిపై నాకు స్పష్టత వచ్చిందని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

కలర్ ఫోటో ఆ స్టార్ దర్శకుడికి నచ్చలేదు.. ఆఫీసుకు పిలిచి మరీ అలా అన్నారు: సందీప్ రాజ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సందీప్ రాజ్ ఒకరు. ఈయన కెరీర్ కొత్తలో చిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత కలర్ ఫోటో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కరోనా కారణాల వల్ల థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఓటీటీలో విడుదల అయినా కూడా అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందింది. దాంతో దర్శకుడిగా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

కలర్ ఫోటో సినిమా ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన ఈయన తదుపరి మూవీకి చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. మొదటి సినిమా తీసిన తర్వాత ఈయన దర్శకత్వంపై కాకుండా నటనపై ఫోకస్ పెట్టి చాలా సినిమాల్లో నటించాడు. కొంతకాలం క్రితం ఈయన మొగ్లీ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. అది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో కలర్ ఫోటో సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనకు ఏ విషయాలు చెప్పాడనే దానిపై ఓపెన్ అయ్యాడు.

తాజాగా సందీప్ రాజ్ మాట్లాడుతూ... కలర్ ఫోటో విడుదల అయ్యి దానికి జాతీయ అవార్డు కూడా వచ్చిన తర్వాత రాజమౌళి గారు నాకు ఫోన్ చేసి ఆఫీస్కు రమ్మన్నారు, నేను వెళ్ళాను. ఆ తర్వాత ఆయన "కలర్ ఫోటో సినిమా చూశాను, కానీ నాకు నచ్చలేదు" అన్నారు. "హీరో పాత్రతో నేను ట్రావెల్ కాలేకపోయాను. అందులో హీరో పాత్ర చనిపోవడం నాకు నచ్చలేదు. ఎక్కడైనా చావుతో కథ ప్రారంభం కావాలి, పూర్తి కాకూడదు. అదే నీ సినిమా విషయంలో జరిగిన తప్పు. హీరో చావు ఒక మంచి పరిణామాలకు దారి తీస్తే అది బాగుంటుంది" అని రాజమౌళి గారు చెప్పారు. "అలాంటి గొప్ప దర్శకుడు చెప్పిన విషయాలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి, అలాగే నెక్స్ట్ సినిమా విషయంలో ఎలా ఉండాలి అనేదానిపై క్లారిటీ ఇచ్చాయి" అని సందీప్ రాజ్ చెప్పుకొచ్చాడు.

Next Story