"బేబీ" నేషనల్ అవార్డులు సాధించడంపై స్పందించిన డైరెక్టర్

by Ajay Maddhiboyina |

బేబీ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు రావడంపై డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించారు.

బేబీ నేషనల్ అవార్డులు సాధించడంపై స్పందించిన డైరెక్టర్
X

దిశ‌, వెబ్ డెస్క్: బేబీ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు రావడంపై డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించారు. బేబీకి బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ మెయిల్ సింగర్ క్యాటగిరీల్లో అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్క్రీన్ ప్లేకు అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం అన్నారు. కలర్ ఫోటో సమయంలో అవకాశం ఉండే అని కానీ ఈసారి చాలా మంచి సినిమాలు పోటీలో ఉండటంతో వస్తుందని ఊహించలేదన్నారు. బేబీపై వచ్చిన విమర్శలు నిజం అయితే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదని, ఇన్ని అవార్డులు వచ్చేవి కాదన్నారు. కలర్ ఫోటో సినిమాకు నేషనల్ అవార్డు కోసం చాలా కష్టపడి అప్లై చేశామన్నారు. కానీ ఆ సినిమాకు రాలేదని చెప్పారు. మనిషిలో మంచి చెడులు రెండు ఉంటాయని అవి చూపించే విధంగా బేబీ కథ రాసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హిందీలో బేబీ సినిమాను తెరకెక్కించడంతో పాటు చెన్నై లవ్ స్టోరీస్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నానని తెలిపారు.

Next Story