లోపాల కంటే కంటెంట్ ముఖ్యం.. కరుప్పు వివాదంపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కరుప్పు చిత్రంపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా స్పిందించాడు డైరెక్టర్ ఆర్‌జే బాలాజి.

లోపాల కంటే కంటెంట్ ముఖ్యం.. కరుప్పు వివాదంపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: థియేటర్స్‌లో సక్సెస్ అందుకున్న కొన్ని సినిమాలు, ఓటీటీలో వివాదాలకు దారి తీస్తాయి. ఇప్పుడు ఇదే చిక్కు ‘కరుప్పు’కు వచ్చింది. స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కలయికలో వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే.. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చి సరికొత్త వివాదంలో చిక్కుకుంది. డిజిటల్ స్క్రీన్‌పై అత్యంత క్లారిటీగా సినిమాను చూస్తున్న నెటిజన్లు.. ఇందులో ఉపయోగించిన కొన్ని సాంకేతిక లోపాలను ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. ఫైట్ సీక్వెన్స్‌లలో డూప్‌లను ఉపయోగించి, ఆ తర్వాత వీఎఫ్‌ఎక్స్ సహాయంతో సూర్య ముఖాన్ని ఫేస్-స్వాప్ చేయడం వంటివి కనిపెట్టి స్క్రీన్ షాట్ల సాక్ష్యాలతో సహా ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే.. తాజాగా దీనిపై స్పందించిన డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ.. ‘ఈ సినిమా OTTలో విడుదలైంది.. సాధారణంగా, థియేటర్లలో వచ్చిన మంచి సినిమాను OTTలో చూసేటప్పుడు ప్రజలు ప్రతి ఫ్రేమ్‌ను నిశితంగా గమనిస్తూ.. ముఖం వేరేలా కనిపించడం వంటి చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపుతుంటారు. అయితే.. ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు కొన్ని లోపాలు కనిపించవచ్చు.. కానీ వాటికంటే ఇందులో కంటెంట్ ముఖ్యం కదా. కాబట్టి, సినిమాను ఆస్వాదించండి’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఇటీవల సీఎం విజయ్‌ను కలిసినట్లు ఓ ఫొటో షేర్ చేస్తూ.. ‘ఇటీవల నేను విజయ్ సర్‌ను కలిశాను.. 'కరుప్పు' చిత్రానికి ప్రజలు ఆదరిస్తున్న తీరు, సినిమా విజయం పట్ట ఆయన సంతోషం వ్యక్తం చేశారు.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు.. ఆయన ఇక్కడ ఉండటం చలనచిత్ర పరిశ్రమకు ఎంతో ప్రయోజనకరం’ అని తెలిపారు.

Next Story