సూర్య ‘కరుప్పు’ సీక్వెల్‌పై డైరెక్టర్ క్లారిటీ.. ఎవరు చెప్పింది విననంటూ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘కరుప్పు’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ.

సూర్య ‘కరుప్పు’ సీక్వెల్‌పై డైరెక్టర్ క్లారిటీ.. ఎవరు చెప్పింది విననంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: రీసెంట్‌గా వచ్చిన ‘కరుప్పు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ ఆర్జే బాలాజీ. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆర్జే బాలాజీ ఈ సినిమా సీక్వెల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘కరుప్పు’ సినిమా పెద్ద విజయం సాధిస్తోంది.. ‘వెంటనే పార్ట్ 2 మొదలుపెట్టి, ఆ క్రేజ్‌ను సొమ్ము చేసుకోండి’ అని అందరూ అంటారు.. కానీ నేను ఆ ఉచ్చులో పడాలనుకోవడం లేదు. దానిపై నాకు పెద్దగా ఆసక్తి లేదు.. ఆ ఆలోచనతో నేను ఇంకా కొంతకాలం మమేకమై ఉండాలనుకుంటున్నాను. అందుకే ఎవరు చెప్పిన మాటలు నేను పట్టించుకోను. ప్రస్తుతం నా దగ్గర మరో రెండు ఆసక్తికరమైన కథాంశాలు ఉన్నాయి’ అని తెలిపాడు. అలాగే మొదట ఈసినిమాను విజయ్ దళపతి కోసం రాసినట్టు ఇప్పటికే చెప్పిన బాలాజీ.. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో కుదరలేదు అని తెలిపారు. అలాగే.. ‘సూర్య గారితో నేను ఎప్పుడైనా సరే పనిచేయగలను.. అయితే, రాజకీయ నేపథ్యమున్న సినిమా చేయడానికి ఇది సరైన సమయం అని నేను అనుకోవడం లేదు.. ప్రజలు ఎంతో ఆశతో ఒక నిర్ణయానికి ఓటు వేశారు. కాబట్టి కొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉంది.. ప్రస్తుతానికి, నేను నా కుటుంబంతో గడపాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.

Next Story