- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైరతాబాద్ RTO ఆఫీస్‌లో డైరెక్టర్ రాజమౌళి సందడి
ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్(Khairatabad RTO Office)లో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి(Director Rajamouli) సందడి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్(Khairatabad RTO Office)లో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి(Director Rajamouli) సందడి చేశారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చారు. మహేశ్ బాబు - రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్నారు. కాగా, మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇందులో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఒడిశాలో షూటింగ్ జరుపుకున్నారు. అక్కడ ముగిసిన వెంటనే విదేశాలకు షిఫ్ట్ అయ్యారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఒడిశాలో షూటింగ్ జరుగుతోన్న సమయంలో మహేశ్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యారు. షూటింగ్ పూర్తయిన వెంటనే ఆ వీడియోలు బయటకు వచ్చాయి. చాలామంది షేర్, లైక్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీనిపై అప్రమత్తమైన చిత్రబృందం వెంటనే చర్యలకు దిగింది. నెటిజన్లు షేర్ చేసిన వీడియోలను తొలగించింది. ఆ ఘటనతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ టీమ్ తదుపరి షెడ్యూల్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
మహేష్ బాబు సినిమా కోసం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లిన రాజమౌళి
మహేశ్ బాబు - రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్… pic.twitter.com/I1eRqjFBiz






