- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Director Rajamouli: ఆ సినిమా ట్రైలర్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంది.. రిలీజ్ కోసం వెయిటింగ్.. దర్శకధీరుడు రాజమౌళి కామెంట్స్ వైరల్
సూపర్ స్టార్ ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’ (Kubera).

దిశ, సినిమా: సూపర్ స్టార్ ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’ (Kubera). శేఖర్ కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈమేరకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) మాట్లాడుతూ.. ‘శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్‌గా హంబుల్‌గా ఉంటారు. శేఖర్ ఆయన నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకు సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్ పోల్స్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాల అయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను కానీ నాకంటే వన్ ఇయర్ సీనియర్ తను. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీశాడు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నాగార్జున, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర.. ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్‌గా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. కుబేర ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. శేఖర్ కమ్ముల తన సినిమాని ట్రైలర్(Trailer)లోనే చెప్పేస్తారు. కానీ కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది. నాగార్జునను, ధనుష్‌ని ఎలా కలిపిపాడు? వాళ్ళ మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా క్యూరియాసిటిగా అనిపిస్తుంది. దీని కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. ప్రతిది టాప్ క్లాస్‌లో ఉన్నాయి. జూన్ 20.. డోంట్ మిస్ కుబేర’ అనిఅన్నారు.






