- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HIT-3 :నాని కోసం రాజమౌళి.. పోస్టర్ మామూలుగా లేదుగా?
నేచురల్ స్టార్ నాని (Nani), శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ హై వోల్టెడ్ మూవీ ‘హిట్-3’.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani), శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ హై వోల్టెడ్ మూవీ ‘హిట్-3’. ఈ యాక్షన్ థ్రిల్లర్ (Action thriller) చిత్రం ‘హిట్’ ఫ్రాంచైజీస్‌లో తెరకెక్కుతుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే.. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తుండగా.. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ ఓ వైపు ఇంటర్వ్యూలో పాల్గొంటూనే వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. HIT3 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 27న సాయంత్రం 6 గంటల నుంచి JRC కన్వెన్షన్స్‌లో జరుగుతుండగా.. దీనికి ఛీప్ గెస్ట్‌గా దర్శకధీరుడు రాజమౌళి హాజరవుతున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంది.






