- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస లైనప్స్‌తో యంగ్ దర్శకుడు.. తెలుగుతో పాటు తమిళ నటుడు కూడా
యంగ్ దర్శకుడు పవన్ బాసంశెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేస్తున్నాడు.

దిశ, సినిమా: నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన పవన్ బాసంశెట్టి.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. ఈ సినిమా 2023 విడుదల కాగా ఇప్పటి వరకు ఈ దర్శకుడు మరో చిత్రం అనౌన్స్ చెయ్యలేదు. ఇందులో భాగంగానే తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్టును ఫైనల్ చేసుకున్నట్లు టాక్. ఈ మేరకు తన రెండొవ చిత్రం కోసం సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం ఇద్దరు టాప్ మోస్ట్ కమెడియన్లు లైన్‌లో పెట్టాడట ఈ డైరెక్టర్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించనున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ కమెడీయన్ యోగి బాబు ప్రధాన పాత్రలో కనిపించనుండగా, సత్య మరో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత హీరో శ్రీవిష్ణుతో కూడా ఓ ప్రాజెక్టు చర్చల్లో ఉందని వినికిడి.






