Gandhi Tata Chettu: ఇది కేవలం అవార్డ్‌ సినిమా కాదు.. మూవీపై హైప్ పంచేస్తున్న డైరెక్టర్ కామెంట్స్

by Chukka Sudharani |

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి (Sukriti Veni) బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’

Gandhi Tata Chettu: ఇది కేవలం అవార్డ్‌ సినిమా కాదు.. మూవీపై హైప్ పంచేస్తున్న డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి (Sukriti Veni) బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tata Chettu). మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది (Padmavati Malladi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర దర్శకురాలు పద్మావతి మల్లాది సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ (Interesting) విశేషాలు పంచుకున్నారు.

‘నా స్నేహితుడు చెట్టుకు, మనిషికి లవ్‌స్టోరీ రాస్తే బాగుంటుంది అనడంతో నాకు ఆ ఐడియా బాగా నచ్చింది. నాకు కూడా స్వతహాగా పచ్చదనం, చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ లైన్‌కు నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. మొక్కల గురించి తదుపరి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో ఈ కథ రాసుకున్నాను. ఒక అమ్మాయి అహింసవాదంతో ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేది కథ. పూర్తి సందేశంతో పాటు కమర్షియాలిటి ఉన్న సినిమా. తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఇది కేవలం అవార్డ్‌ సినిమా కాదు. అందరికి నచ్చే కమర్షయాలిటీస్‌, ఎమోషన్స్‌ ఉన్న సినిమా’ అని చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. దీంతో మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story