'అడవి శేష్'తో లిటిల్ హార్ట్స్ దర్శకుడు

by Pulgam srinivas |

'అడవి శేష్'తో లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అడవి శేష్తో లిటిల్ హార్ట్స్ దర్శకుడు
X

దిశ, న్యూస్: ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సాయి మార్తాండ్ మంచి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలై దాదాపు ఐదు నెలలు గడిచినప్పటికీ, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. ఇక తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ యువ దర్శకుడు తన నెక్స్ట్ మూవీని దాదాపు ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అడవి శేష్‌కు సాయి మార్తాండ్ ఇటీవల కథను వినిపించినట్లు సమాచారం. ఆ కథ అడవి శేష్‌కు నచ్చినట్లు, ఈ దర్శకుడితో పని చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని అంశాలు అనుకూలంగా కుదిరితే, త్వరలోనే సాయి మార్తాండ్ దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడితే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Next Story