- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇది మన నేల కథ’.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఇది మన నేల కథ’.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: రోషన్ (Roshan) హీరోగా ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన సినిమా ‘ఛాంపియన్’ (Champion). అనస్వర రాజన్ హీరోయిన్. గురువారం హైదరాబాద్‌లోని ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. గెస్ట్‌గా హాజరైన డైరెక్టర్ నాగ్ అశ్విన్(Director Nag Ashwin) మాట్లాడుతూ.. కల్కి సినిమా చివర్లో ఉన్నప్పుడు ఛాంపియన్ సినిమా మొదలైంది. ఈ సినిమా బిగినింగ్ నుంచి జర్నీ తెలుసు. వైజయంతి ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలుసు. ఈ సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. ప్రదీప్ చాలా ముఖ్యమైన కథ చెబుతున్నారు. రోషన్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. అనస్వర ఈ సినిమా తర్వాత చాలామందికి ఫేవరెట్ అవుతుంది. బైరాన్‌పల్లి వీరులందరి పెర్ఫార్మన్స్ మీ అందరికీ నచ్చుతుంది. అందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడతారు. గిరగిర సాంగ్ ట్రెండ్ అవుతుంది ఛాంపియన్ మన నేల కథ. బైరన్ పల్లి విలేజ్ లో ఏం జరిగిందనేది చాలామందికి తెలీదు. అలాంటి కథ చెప్పాలనే పాషన్‌తోనే వైజయంతి మూవీస్ ఈ సినిమా చేస్తోంది. తప్పకుండా డిసెంబర్ 25న మీరందరూ ఎంజాయ్ చేస్తారని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.






