- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Director Miria Raja: 'హ్యాపీ రాజ్' ఆ తెలుగు హీరో చేయాల్సిన సినిమా
హ్యాపీ రాజ్ సినిమాను నవీన్ పోలిశెట్టి చేయాల్సింది, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా చేయలేదని ఈ సినిమా దర్శకుడు మరియా రాజా చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: నటుడు మరియు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ తాజాగా హ్యాపీ రాజ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు అబ్బాస్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరియా రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బియాండ్ పిక్చర్స్ బ్యానర్లో జై వర్ధ నిర్మించారు. ఈ సినిమాను మార్చ్ 27న తమిళ్, తెలుగులో విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా ఈ చిత్ర దర్శకుడు మరియా రాజా ఈ సినిమా స్టార్ట్ కాకముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్పుకొచ్చాడు. "ఈ స్క్రిప్ట్ మొత్తం తయారయ్యాక టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి గారికి దానిని మెయిల్ చేశాను. ఆయనకు ఈ సినిమా కథ బాగా నచ్చింది. దాంతో నాకు కాల్ చేసి చాలా సేపు మాట్లాడారు.
ఆయనకు ఈ సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది, కానీ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన నటించలేకపోయాడు. కానీ ఆ తర్వాత నాకు ఫోన్ చేసి హ్యాపీ రాజ్ గురించి దాదాపు అరగంటసేపు మాట్లాడారని" ఈ యువ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ మూవీ కామెడీ ప్లస్ ఎమోషన్ మిక్స్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తండ్రి మరియు కొడుకు బాండ్ మీద కథ ఉండేలా హింట్ ఇచ్చారు. ట్రైలర్ జనాలను బాగానే ఆకట్టుకుంది, మరి సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.






