డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ ట్వీట్..సింహంతో అమాంతం హైప్ పెంచేశాడుగా..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-03 06:03:51  IST  )

డైరెక్టర్ మారుతి(Maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab).

డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ ట్వీట్..సింహంతో అమాంతం హైప్ పెంచేశాడుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ మారుతి(Maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంజయ్ దత్(Sanjay dutt) కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్విరామంగా జరుగుతుంది. ఈక్రమంలో మారుతి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా డైరెక్టర్ మారుతి తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. అందులో సింహం గర్జిస్తున్న గిఫ్‌ను పోస్ట్ చేశాడు. దీంతో సినిమాపై ఎలాంటి అప్‌డేట్ ఇస్తాడా అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరి ఈ మూవీ నుంచి ఏ అప్డ్‌ట్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.

Next Story