- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నీళ్లు పెట్టిన డైరెక్టర్ మారుతీ.. ఓదార్చిన ప్రభాస్
కన్నీళ్లు పెట్టిన డైరెక్టర్ మారుతీ.. ఓదార్చిన ప్రభాస్

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం(The Raja Saab Movie) జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటించారు. సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శనివారం ‘ది రాజాసాబ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతీ(Maruthi) కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టని నేను.. ప్రభాస్ చేసిన హెల్ప్ తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. మారుతీ కన్నీళ్లు పెట్టడం చూడలేకపోయిన ప్రభాస్.. స్వయంగా స్టేజీ మీదకు వెళ్లి ఓదార్చారు. అంతకుముందు నిర్మాత ఎస్‌కేఎన్ మారుతీకి ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






