గాఢ నిద్ర‌లో మారుతి..ది రాజాసాబ్ హిట్టా, ఫ‌ట్టా ?

by velandi.Saikiran |   (  Updated:2026-01-07 08:18:01  IST  )

ది రాజా సాబ్ మూవీ కచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడట మారుతి. అందుకే హాయిగా నిద్రిస్తూ, ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరూ టెన్షన్ పడొద్దు అంటూ హింట్ ఇస్తున్నాడట. అయితే ఈ ఫోటోను చూసిన ప్రభాస్ అభిమానులు మాత్రం కాస్త‌ టెన్షన్ పడుతున్నారు. సినిమా తేడా వస్తే మాత్రం మారుతిని అసలు వదలబోమని హెచ్చరిస్తున్నారు.

గాఢ నిద్ర‌లో మారుతి..ది రాజాసాబ్ హిట్టా, ఫ‌ట్టా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఎల్లుండి రిలీజ్ కానుంది. కేవలం ఈ మూవీ విడుదలకు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రమోషన్స్ చేయకుండా దర్శకుడు మారుతి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మారుతి పడుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్స్ చేసుకోకుండా, ఇలా అడ్డంగా పడుకున్నావ్ ? ఏంటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే తాను తీసిన ది రాజా సాబ్ మూవీ కచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడట మారుతి. అందుకే హాయిగా నిద్రిస్తూ, ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరూ టెన్షన్ పడొద్దు అంటూ హింట్ ఇస్తున్నాడట. అయితే ఈ ఫోటోను చూసిన ప్రభాస్ అభిమానులు మాత్రం కాస్త‌ టెన్షన్ పడుతున్నారు. సినిమా తేడా వస్తే మాత్రం మారుతిని అసలు వదలబోమని హెచ్చరిస్తున్నారు.

రాజ సాబ్ పై పాజిటివ్ వైబ్స్

సంక్రాంతి కానుకగా దాదాపు అరడజన్ సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ అన్ని సినిమాలతో పోలిస్తే ప్రభాస్ చేసిన రాజా సాబ్ హిట్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు. సంక్రాంతి విన్నర్ గా కచ్చితంగా ది రాజా సాబ్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేయగా ముగ్గురు హీరోయిన్లు నటించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఈ సినిమాలో మెరువనున్నారు.

Read More..

చిరంజీవి, ప్రభాస్ నిర్మాతలకు హైకోర్టులో ఊరట

Next Story