- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకుని తిరుగుతున్న దర్శకుడు
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ హారర్,

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ హారర్, కామెడీ థ్రిల్లర్ సినిమా ది రాజా సాబ్ కోసం చాలా కష్టపడుతున్నారు ప్రభాస్. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారు. మాళవిక మోహన్, రిద్ధి కుమార్ , ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రభాస్ సరసన నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత స్వరాలు అందించారు. జనవరి 9 అంటే 2026 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది.
ఇలాంటి నేపథ్యంలో రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ ఫోటో జేబులో ఫోటో పెట్టుకొని పని చేశానని, ఆయన ఫోటో ఉంటే ఎవరైనా తోపు దర్శకుడు అవుతారని నమ్మకం ఉన్నట్లు తెలిపారు మారుతి. అందుకే నిత్యం జేబులో ప్రభాస్ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నట్లు వివరించారు. ఫ్యాన్స్ కోసమే ప్రభాస్ ఈ సాంగ్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని వెల్లడించారు. రిలీజ్ కు ముందే అందరూ రెబల్ ఆరాలో ఉండబోతున్నట్లు వివరించారు. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీసినట్లు స్పష్టం చేశారు మారుతి.






