Naveen Polishetty: స్టార్ డైరెక్టర్‌తో నవీన్ పొలిశెట్టి సినిమా.. ఫ్రెస్ లవ్ స్టోరీ రాబోతుంది అంటూ పోస్ట్

by Chukka Sudharani |

‘జాతిరత్నాలు’ సినిమాతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ (youthful entertainer)గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: స్టార్ డైరెక్టర్‌తో నవీన్ పొలిశెట్టి సినిమా.. ఫ్రెస్ లవ్ స్టోరీ రాబోతుంది అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ సినిమాతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ (youthful entertainer)గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘అనగనగా ఒకరాజు’ (Anaganaga Okaraju) ఒకటి. మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితారఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. ఈ మూవీ నుంచి వరుస అప్‌డేట్ ఇస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. నవీన్ పొలిశెట్టి నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవీన్ పొలిశెట్టి ఓ బంపర్ ఆఫర్ (bumper offer) అందుకున్నట్లు తెలుస్తోంది. తమిళం (Tamil)లోనే స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మణిరత్నం (Mani Ratnam)తో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు.. యంగ్ & టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి ఒక అందమైన ప్రేమకథ కోసం మణిరత్నంతో జతకట్టేందుకు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే మణిరత్నం టీమ్ నవీన్ పొలిశెట్టిని సంప్రదించగా ప్రాజెక్ట్ ఓకే అయినట్లు తమిళ ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ డైరెక్టర్ మణిరత్నం ‘థగ్ లైఫ్’ (Thug Life) చిత్రంతో బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అనంతరం నవీన్‌తో సినిమా తెరెకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారట డైరెక్టర్. కానీ, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.

Next Story