- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్య శ్రీపై ఆ అనుమానం ఉండేది.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
కుర్ర హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక్కడ నటీనటులను ఓ దైవంగా భావించే కల్చర్‌ను ఇష్టపడిన ఆమె.. ఇక్కడే ఉండిపోవాలని అనుకున్నట్లు కూడా చెప్పింది. అలాంటి ప్రేమ తాను కూడా పొందాలనుకుంటున్నానని..

దిశ, వెబ్ డెస్క్ : కుర్ర హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక్కడ నటీనటులను ఓ దైవంగా భావించే కల్చర్‌ను ఇష్టపడిన ఆమె.. ఇక్కడే ఉండిపోవాలని అనుకున్నట్లు కూడా చెప్పింది. అలాంటి ప్రేమ తాను కూడా పొందాలనుకుంటున్నానని.. ఇందుకు ఎంతైనా కష్టపడుతానని తెలిపింది. ఇక తాజాగా ఆమె చేసిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రిలీజ్ కాగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్ మహేష్ బాబు పి ప్రశంసల వర్షం కురిపించాడు. ‘భాగ్య శ్రీ బోర్సేను అనుకున్నప్పుడు అందరికీ డౌట్ ఉండేది.. యాక్టింగ్ బాగా చేయగలదా లేదా అని.. కానీ ఆడిషన్స్‌లో సింగిల్ షాట్‌లో అన్ని ఎమోషన్స్ పలికించింది. ఆమె పెయిన్‌ను చాలా బాగా చూపించగలదు’ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ఆమె కచ్చితంగా స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంటున్నారు. ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.






