- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘కూలీ’ రిలీజ్‌పై డైరెక్టర్ క్లారిటీ
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Director Lokesh Kanagaraj ) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’(Coolie).

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Director Lokesh Kanagaraj ) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’(Coolie). ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ పోస్టర్ నుంచే ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. అంతే కాకుండా ఈ ఏప్రిల్ 14న ఈ సినిమా టీజర్ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే మరో బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చాడు డైరెక్టర్. ‘కూలీ’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2025 ఆగస్టు 14న భారీగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం కాబోతుందని తెలుపుతూ మోస్ట్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






