- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lokesh Kanagaraj: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన డైరెక్టర్.. వైరల్‌గా లోకేష్ కనగరాజ్ పోస్ట్
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’.

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’. ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రానికి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ (Gold smuggling) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా క్రియేట్ కాగా.. రీసెంట్‌గా వచ్చిన టీజర్(Teaser)కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించింది. దీంతో సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అంతే కాకుండా.. ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ X వేదికగా.. ‘అందరికి హాయ్.. కూలీ ప్రమోషన్ల వరకు నేను అన్ని సోషల్ మీడియా (Social media) ప్లాట్‌ఫామ్‌ల నుండి చిన్న విరామం తీసుకుంటున్నాను’ అంటూ ప్రకటించారు. దీంతో కొందరు నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మరికొందరు అయితే.. సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ మెసేజులు చేస్తుంటే తట్టుకోలేక కొన్ని రోజులు దూరంగా ఉండాలి అనుకుంటున్నారేమో అని రిప్లైలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా.. ‘కూలీ’ చిత్రం 2025 ఆగస్టు 14న భారీగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం కాబోతుంది.
Hey guys!
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 22, 2025
I'm taking a small break from all the social media platforms until #Coolie's promotions
With Love,
Lokesh Kanagaraj 🤜🏼🤛🏼






