- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్.. గ్యాంబ్లర్స్ చిత్రంపై డైరెక్టర్ కామెంట్స్
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో హీరోగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్ క్రేజీ హీరో సంగీత్ శోభన్

దిశ, సిపిమా: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో హీరోగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్ క్రేజీ హీరో సంగీత్ శోభన్ (Sangeet Shobhan). ఇప్పుడు ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్యాంబ్లర్స్’ (Gamblers). ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దీనికి కేఎస్‌కే చైతన్య (KSK Chaitanya) దర్శకత్వం వహిస్తుండగా.. రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు. ఇక రిలీజ్‌కు ఎంతో సమయం లేకపోవడంతో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్టలుక్ పోస్టర్(First look poster)ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో కొత్త సంగీత్ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఇందులో రాకింగ్ రాకేష్ ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంది’ అన్నారు.






