Mirai: ఈ సినిమాకు అనుకున్నదాని కంటే ఎక్కువ ఖర్చు అయింది.. మిరాయ్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిరాయ్‌’.

Mirai: ఈ సినిమాకు అనుకున్నదాని కంటే ఎక్కువ ఖర్చు అయింది.. మిరాయ్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిరాయ్‌’. పాన్-ఇండియా రేంజ్‌లో విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమా విశేషాలు పంచుకున్నాడు. ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘మిరాయ్ స్టోరీ ఐడియా ఏడేళ్ల క్రితమే వచ్చింది. అయితే.. ఈ ఆలోచనకి ఇతిహాసాలని ఎలా ముడి పెట్టొచ్చనే ప్రాసెస్‌కి ఎక్కువ టైం పట్టింది. అశోకుని వద్ద తొమ్మిది గ్రంధాలు ఉన్నాయానే ఒక మిత్ ఉంది. ఆ తొమ్మిది పుస్తకాలు దుష్టుల బారిన పడితే, వాటిని మన ఇతిహాసాలు ఆధారంగా ఎలా కాపాడవచ్చనేది మిరాయ్ ఐడియా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఇతిహాసాల్లో పురాణాల్లో ఉందనే నమ్మకంతో చేసిన కథ. ఈ కథని యాక్షన్ అడ్వంచర్‌గా ట్రీట్ చేశాం. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్. ఈ కథ దాదాపు ప్రజెంట్‌లోనే జరుగుతుంది. ఈ సినిమా చేసిన ప్రాసస్ డిఫరెంట్. నటీనటులందరినీ రియల్ లోకేషన్స్‌లోకి తీసుకెళ్ళాం. మంచు పర్వతాల్లో, ఎడారుల్లో, అడవుల్లో.. అన్నిట్లో రియల్‌గా చేశాం. మొత్తం షూటింగ్‌లో ఒక్క సీనియర్ యాక్టర్‌కి కూడా కార్వాన్ లేదు. వారి సపోర్ట్ వలన ఈ సినిమాకి అంత అద్భుతంగా కుదిరింది.

ఈ సినిమా కారణంగా శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయిలాండ్.. మొత్తం ఏసియా అంతా తిరిగేశాం. మా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియానే వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చేయడంతో మాకు చాలా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా కావాల్సినంత సమయం, మనీ.. రెండూ ఖర్చు చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. బడ్జెట్ మేము అనుకున్న దానికంటే కొంచెం క్రాస్ అయ్యింది. అయినా కూడా నిర్మాత విశ్వప్రసాద్ పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. ఆయన పాషన్ తోనే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ఒక ప్లెస్ పాయింట్. మంచి హై క్రియేట్ చేసేలా మ్యూజిక్ చేశారు. తప్పకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకి వచ్చే రిజల్ట్‌ని బట్టి మిరాయ్ సీక్వెల్ అలోచించాలి’ అని తెలిపారు.

Next Story