ఈ సినిమా చూసి డిస్ట్రిబ్యూటర్స్ ఏడ్చారు.. డైరెక్టర్ కామెంట్స్‌తో మూవీపై మరింత హైప్

by Chukka Sudharani |   (  Updated:2025-09-15 15:34:06  IST  )

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’.

ఈ సినిమా చూసి డిస్ట్రిబ్యూటర్స్ ఏడ్చారు.. డైరెక్టర్ కామెంట్స్‌తో మూవీపై మరింత హైప్
X

దిశ, సినిమా: అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్స్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బ్యూటీ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

‘బ్యూటీ కథ మారుతీ పిలిచి నాకు ఇచ్చారు. దీన్ని సుబ్రహ్మణ్యం అనే జర్నలిస్ట్ రాశారు. ఆయనే డైరెక్ట్ చేయాలి కానీ వేరే వాళ్లకు ఇమ్మనడంతో జీ వాళ్ళు నా వర్క్ నచ్చి నన్ను ప్రపోజ్ చేశారు. మొదటిసారి నేను వేరే వాళ్ళ కథకు పనిచేసాను. దాంతో నేను వారం రోజులు కథని అర్ధం చేసుకున్నాను. ఒక్క లైన్‌లో ఈ సినిమా కథ చెప్పాలంటే.. ఇదొక మధ్యతరగతి అమ్మాయి గురించి. ఇప్పుడు అందరూ మన జీవితం కాకుండా పక్కనోళ్ళ జీవితం చూసి కంపారిజన్ చేసుకుంటున్నారు. ఇందులో హీరోయిన్ కూడా టీనేజర్స్ లాగా పక్కనోళ్ళతో కంపేర్ చేసుకొని తన కుటుంబ స్థితి మర్చిపోయి అది కావాలి ఇది కావాలి అంటారు. మనం స్థితికి మించి వాళ్ళని చదివిస్తాం అయినా వాళ్ళు పక్కనోళ్ళతో కంపేర్ చేసుకుంటారు. మనం ఎంత చేసినా చిన్న లోటు కనిపిస్తే దాన్ని హైలెట్ చేస్తారు పిల్లలు. అదే కథాంశంతో ఉంటుంది. ఈ సినిమాలో నాన్న క్యాబ్ డ్రైవర్ అయినా ఆయన స్థితి మించి చేస్తున్నా కూతురికి తెలీదు. ఇందులో క్లాస్‌లు పీకడాలు ఏమి లేవు. ఒక జీవితం చూపిస్తాను. చాలా ఎమోషనల్‌గా అందరిని ఆకట్టుకునే కథ ఇది. ఈ సినిమా చూసి డిస్ట్రిబ్యూటర్స్ ఏడ్చేశారు.. అంత ఎమోషనల్ టచ్ ఉంటుంది’ అని తెలిపాడు.

Next Story