- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వర్సెస్ జర్నలిస్ట్
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం నటుడిగానూ రానిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం నటుడిగానూ రానిస్తున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తమిళ సినిమా జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా రాబోతుంది. ఇక నేడు ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ సినిమా జర్నలిస్టును తరుణ్ భాస్కర్ అవమానించారు. జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్న సమయంలో హ్యాపీ క్రిస్మస్ సార్ అంటూ ట్రోల్ చేశారు.
గతంలోనూ తరణ్ భాస్కర్ ఇలాగే మాట్లాడంతో అప్పుడు తనపై ట్రోల్స్ వచ్చాయని జర్నలిస్ట్ అసహనం వ్యక్తం చేశారు. తాము కూడా ట్రోల్ చేయాలి అనుకుంటే చేస్తామని కానీ పద్దతి కాదని అన్నారు. తీవ్ర అసహనానికి గురై అక్కడ నుండి వెళ్లిపోయేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో కూడా ఒకరిపై మరొకరు పంచ్ లు వేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ జర్నలిస్టు నటీనటులను సైతం ఇబ్బంది పెట్టేలే ప్రశ్నలు వేస్తాడని తరుణ్ భాస్కర్ మంచిపనే చేశాడని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు తరుణ్ భాస్కర్ తీరు సరిగా లేదని కామెంట్ చేస్తున్నారు.






