జాక్ పాట్ కొట్టిన దర్శకుడు.. ‘గట్టకుస్తీ-2’ హిట్ కావడంతో ఖరీదైన బహుమతులు ఇచ్చిన విష్ణు విశాల్

by Mallepaka Hamsa |

గత 11 ఏళ్లుగా తన జీవితంలో ఎదురైన ప్రతి సంతోషంలోనూ, ప్రతి కష్టంలోనూ తోడుగా నిలిచిన చెల్లా అయ్యావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జాక్ పాట్ కొట్టిన దర్శకుడు.. ‘గట్టకుస్తీ-2’ హిట్ కావడంతో ఖరీదైన బహుమతులు ఇచ్చిన విష్ణు విశాల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, దర్శకుడు చెల్లా అయ్యావు కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గట్ట కుస్తీ-2’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ‘గట్ట కుస్తీ’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. అయితే రివ్యూలు ఓ మాదిరిగా వచ్చినప్పటికీ అద్భుతమైన స్పందనతో రూ. 50 కోట్ల దిశగా దూసుకుకెళ్తోంది. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో, విష్ణు విశాల్ దర్శకుడు చెల్లా అయ్యావుతో పాటు నిర్మాతలకు లగ్జరీ కార్లను కానుకగా ఇచ్చారు. అంతేకాకుండా ఎక్స్‌ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గత 11 ఏళ్లుగా తన జీవితంలో ఎదురైన ప్రతి సంతోషంలోనూ, ప్రతి కష్టంలోనూ తోడుగా నిలిచిన చెల్లా అయ్యావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై ఆయన చూపించిన నమ్మకం, స్నేహం, అందించిన సపోర్ట్ గురించి మాటల్లో చెప్పలేనని ఎమోషనల్ అయ్యారు.

ఈ బహుమతి నీకోసమేనని, దీనికి నువ్వు వంద శాతం అర్హుడివి అని రాసుకొచ్చారు. దర్శకుడు చెల్లా అయ్యావును ఆశ్చర్యపరుస్తూ మార్కెట్లో దాదాపు రూ. 15 నుండి 20 లక్షల ధర పలికే సరికొత్త టయోటా హైక్రాస్ కారును విష్ణు విశాల్ అందజేశారు. దాంతో పాటు 10 గ్రాముల బంగారు గొలుసు, ఒక బ్రేస్‌లెట్‌ను కూడా కానుకగా ఇచ్చారు. ఇక ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించిన నిర్మాత ఇషారి గణేశ్‌కు ఏకంగా బీఎండబ్ల్యూ-3 సిరీస్ లగ్జరీ కారును బహుమతిగా ప్రజెంట్ చేశారు. వీళ్లతో పాటే సినిమాలో పనిచేసిన మిగతా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు (టెక్నీషియన్స్) కృతజ్ఞతగా 40 గ్రాముల వెండి నాణేలను పంపిణీ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమా సక్సెస్ సాధించినప్పుడు టీమ్‌ను ఈ రేంజ్‌లో గౌరవించడంపై విష్ణు విశాల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Next Story