- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది సినిమాకు హైలెట్ అదే.. డైరెక్టర్ బుచ్చిబాబు సనా కామెంట్స్ వైరల్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా ‘పెద్ది’ సినిమా విశేషాలు పంచుకున్నారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు బుచ్చిబాబు. ‘పెద్ది క్యారెక్టర్‌కి ఇన్స్‌స్పిరేషన్ మా ఊర్లో ఉండే పెద్ది రాజు అనే అబ్బాయి. కూలీ పనికి వెళ్ళేవాడు, కానీ క్రికెట్, వాలీబాల్ చాలా బాగా అడెవాడు. మేము డబ్బులు ఇచ్చి మరీ మ్యాచ్‌లు ఆడించుకునే వాళ్లం. సింగిల్ హ్యాండ్ మ్యాచ్‌లు గెలిపించేవాడు.‘ఈ క్యారెక్టర్ చాలా బాగుందే’ అని అనుకోని ఆ లైన్ తో స్టోరీ క్రియేట్ చేసా. మళ్లీ పెద్ది లాంటి కథ రాయడం నాకు కష్టమే. పెద్ది లాంటి కథ చెయ్యడం రామ్ చరణ్‌కు కష్టమే. ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డారు. ఆయన వద్దు అన్నారు అని డూప్ కూడా ఎక్కడా పెట్టలేదు’ అని తెలిపారు. ఇక స్పెషల్ సాంగ్ అప్డేట్ ఇస్తూ.. ‘ఈ సాంగ్ హుక్ లైన్ చాలా బాగా వచ్చింది. తెలుగులోనే కాదు హిందీలో కూడా ఈ లైన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. థియేటర్‌లో ఈ బిట్ వినగానే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు పెద్ద హైలైట్ అవుతుంది’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.
అలాగే ఎ.ఆర్.రెహమాన్ ఈ సాంగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారని బుచ్చిబాబు సనా చెప్పారు. రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్, బీట్స్ అన్నీ మాస్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని, ఈ పాట థియేటర్లలో పెద్ద బ్లాస్ట్ అవుతుందని ఆయన నమ్మకంగా చెప్పారు. కొంతమందితో వర్క్ చేయాలని కల ఉంటుంది కదా. అలా నాకు చిన్నప్పటి నుంచి ఏఆర్ రెహమాన్ సార్‌తో వర్క్ చేయాలని ఒక డ్రీమ్ ఉండేది. ఆయన నన్ను మూడు ట్యూన్స్ వినమని అడిగారు, నేను మూడు బాగాలేవు అని చెప్పాను. తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఆయన ఒక మాట అన్నారు.. ‘నువ్వు నా ట్యూన్‌ను వెయ్యి సార్లు రిజెక్ట్ చేసినా సరే, నేను ఇంకో కొత్త ట్యూన్ ఇస్తాను. దాని గురించి బాధపడకు’ అని అన్నారు. ఆయనతో వర్క్ చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు సనా.






