War 2: వార్-2పై మరింత హైప్ పెంచేసిన డైరెక్టర్ అయాన్ ముఖేర్జీ.. వారికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందంటూ కామెంట్

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘వార్-2’ (War 2).

War 2: వార్-2పై మరింత హైప్ పెంచేసిన డైరెక్టర్ అయాన్ ముఖేర్జీ.. వారికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందంటూ కామెంట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘వార్-2’ (War 2). అయాన్ ముఖేర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2019లో వచ్చిన ‘వార్’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఇందులో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అయాన్ ముఖేర్జీ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేశాడు. ‘‘వార్-2’ విషయంలో నాపై ఎంతో బాధ్యత ఉంది.

వార్ చిత్రానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి సీక్వెల్‌గా వస్తున్న వార్-2పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందుకే.. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాం. ఇది నాకు దొరికిన ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో వర్క్ చేస్తుండటంతో స్టోరీ లైన్‌పై ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేయడం వల్ల ఇది నిజమైన ఇండియన్ సినిమా కానుంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారో నాకు తెలుసు.. థియేటర్స్‌లో కూర్చున్నప్పుడు వారికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాను.. అలా ఇచ్చేందుకు ప్రతి క్షణం పనిచేస్తున్నా’ అని తెలిపాడు.

Next Story