AA22 మనందరినీ గర్వపడేలా చేస్తుంది.. డైరెక్టర్ కామెంట్స్‌తో అల్లు అర్జున్ సినిమాపై భారీ హైప్

by Chukka Sudharani |   (  Updated:2025-06-14 15:35:34  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.

AA22 మనందరినీ గర్వపడేలా చేస్తుంది.. డైరెక్టర్ కామెంట్స్‌తో అల్లు అర్జున్ సినిమాపై భారీ హైప్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ‘AA22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘AA22 మన దేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రం. ఈ సినిమాలో అనేక కొత్త టెక్నాలజీలను జోడిస్తున్నాము. అలాగే ఈ మూవీ మనందరినీ గర్వపడేలా చేస్తుంది. ఈ సినిమా బడ్జెట్ ఇంకా ఖరారు కాలేదు.. విడుదల తేదీని నిర్మాత నిర్ణయిస్తారు’ అని చెప్పుకొచ్చారు. ఇక అట్లీ కామెంట్స్‌తో AA22పై ప్రేక్షకులతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

Twitter link

Next Story