- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Director Atlee : డైరెక్టర్ అట్లీకి సత్యభామ యూనివర్సిటీ డాక్టరేట్
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Director Atlee)కి అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Director Atlee)కి అరుదైన గౌరవం దక్కింది. చెన్నై(Chennai)లోని సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీ(Satyabhama Deemed University) డైరెక్టర్, స్క్రీన్‌రైటర్, నిర్మాత అట్లీ కుమార్‌కు గౌరవ డాక్టరేట్(Honorary Doctorate) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 14న జరిగే తమ యూనివర్సిటీ 34వ కాన్వొకేషన్లో అట్లీకి డాక్టరేట్ అందించనున్నట్టు పేర్కొంది. భారతీయ సినిమా రంగంలో.. ముఖ్యంగా తమిళ, హిందీ చిత్రాలలో అతను చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందిస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా అట్లీ.. రాజా రాణి(2013), తెరి(2016), మెర్సల్(2017), బిగిల్(2019) వంటి తమిళ చిత్రాలతోపాటు హిందీలో జవాన్(2023) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు.
అతని చిత్రాలు కమర్షియల్ విజయంతో పాటు సామాజిక సమస్యలను చర్చించడంలో కూడా విజయం సాధించాయి. ఇక అట్లీ తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.






