Atlee: ‘వయస్సు ప్రేమ నుంచి మిమ్మల్ని రక్షించదు కానీ.. ప్రముఖ దర్శకుడు సెన్సేషనల్ పోస్ట్

by Kodari Anjali |

ప్రముఖ దర్శకుడు అట్లీ (Director Atlee)గురించి ప్రDirector Atleeత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Atlee: ‘వయస్సు ప్రేమ నుంచి మిమ్మల్ని రక్షించదు కానీ.. ప్రముఖ దర్శకుడు సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు అట్లీ (Director Atlee)గురించి ప్రDirector Atleeత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తమిళ డైరెక్టర్ అయిన ఈయన రాజా రాణి (Raja Rani) చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో ఈయన ఎండిరాన్ (Endiron)చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడి(Assistant Director)గా వర్క్ చేశాడు. వీటితో పాటుగా అట్లీ.. దర్శకుడు శంకర్‌(Shankar)తో ఐదు ఏళ్లు ఎన్తిరెన్, నాన్బ్ వంటి మైలురాయి చిత్రాలకే అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. అట్లీ చిన్న వయస్సులోనే ఇంత ఫేమ్ దక్కించుకోవడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు.

దర్శకుడు శంకర్ తో కలిసి పని చేసిన ముగ్గపుతగం సినిమాకు అట్లీ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంధకారం (Andhakaram), విజిల్ (Whisle), అదిరింది (Adirindhi), పోలీస్ (Police), రాజా రాణి (Raja Rani), తేరీ (Theri), సంగిలి బుంగిలి కధవ తోరే (Sangili Bungili Kadhava Tore), మెర్సల్ (Mersal), బిగిల్ (Bigil), జవాన్ (Jawan), దళపతి 68 (Thalapathy 68) వంటి తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డులు సృష్టించాడు.

అట్లీ మొదటిసారి దర్శకత్వం వహించిన రాజా రాణి చిత్రానికి అవార్డు కూడా అందుకున్నాడు. ప్రముఖ హీరో విజయ్ తో చేసిన తేరి, మెర్సల్, బిగిల్, మూడు సినిమాలు భారీ హిట్ కొట్టడంతో హ్యాట్రిక్ సాధించాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Bollywood's Badshah Shah Rukh Khan) తో పాన్ ఇండియా సినిమా జవాన్ కు దర్శకత్వం వహించాడు.

ఇదంతా పక్కన పెడితే అట్లీ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘"వయస్సు మిమ్మల్ని ప్రేమ నుంచి రక్షించదు. కానీ ప్రేమ కొంతవరకు మిమ్మల్ని వయస్సు నుంచి రక్షిస్తుంది." - జీన్ మోరేయు అంటూ రాసుకొచ్చాడు. అలాగే అట్లీ లేటెస్ట్ ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అట్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story