‘సౌండ్ పెంచా.. రఫ్పాడిస్తా’.. అనిల్ రావిపూడి సెన్సేషనల్ ట్వీట్

by Gantepaka Srikanth |

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) - యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రాన్ని ఉగాది పండుగ రోజున ప్రారంభించారు.

‘సౌండ్ పెంచా.. రఫ్పాడిస్తా’.. అనిల్ రావిపూడి సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) - యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రాన్ని ఉగాది పండుగ రోజున ప్రారంభించారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ సహా కీలక వ్యక్తుల సమక్షంలో ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా.. సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడి మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఆయనతో జర్నీ చేయడానికి మా టీమ్ మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ సారి సౌండ్ మరింత పెంచాం.. రఫ్పాడిస్తాం’ అని అని రావిపూడి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు కావాలి.. అస్సలు డిజప్పాయింట్ చేయొద్దన్నా అంటూ అనిల్‌కు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల(Sushmita Konidela) ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'మెగా 157' అనే వర్కింగ్ టైటిల్‌‌తో షూటింగ్ ప్రారంభించారు. హీరోయిన్‌గా పరిణితి చోప్రా(Parineeti Chopra), అథితి రావు హైదరి ఎంపికయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా హీరోయిన్లపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Next Story