- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరో రెస్టారెంట్‌పై డైరెక్టర్ అనిల్ రావిపూడి హాట్ కామెంట్స్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ (Praveen) ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant).

దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ (Praveen) ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant). ఈ చిత్రంలో వైవా హర్ష (Viva Harsha) టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ తదితరలు ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం నుంచి తాజాగా బకాసుర టైటిల్ ర్యాప్ సాంగ్‌ను బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘బకాసుర రెస్టారెంట్ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ప్రవీణ్ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలి. తొలి చిత్ర దర్శకుడు ఎస్‌జే శివతో పాటు అందరికి ఈ చిత్రం మంచి పేరును తీసుకురావాలి’ అన్నారు.
దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం. అనిల్ రావిపూడి మా సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా చిత్రం అందరికీ నచ్చుతుంది’ అన్నారు.






