Anil Ravipudi: నాకు తెలిసిందే నేను తీస్తాను.. ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్

by Chukka Sudharani |

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

Anil Ravipudi: నాకు తెలిసిందే నేను తీస్తాను.. ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా సంక్రాంతి బరిలో సూపర్ హిట్ (Super hit) చిత్రంగా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. దీంతో ప్రజెంట్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడు.

‘సినిమా రిలీజ్‌కు ముందు ఎలా ఉంటుందా అని టెన్షన్ ఉండేది. రిలీజ్ అయ్యాక రిజల్ట్ చూసి కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. మేము ఊహించిన దానికంటే సక్సెస్ ఇచ్చారు ప్రేక్షకులు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను ఈ రేంజ్‌కు తీసుకెళ్లిన ఆడియన్స్‌ (Audience)కు నా పాదాభివందనాలు. ఇప్పటి వరకు నేను చేసిన 8 సినిమాలు ఒక్కొక్క సినిమా ఒక్కో జర్నీ, ఇందులో లాస్ట్ 5 సినిమాలు కంటిన్యూగా వందకోట్ల గ్రాసర్స్ సాధించాయి. అలాగే యూఎస్‌లో వన్ మిలియన్ గ్రాసర్స్‌ను సాధించాయి. ఒక డైరెక్టర్‌గా ప్రేక్షకులకి ఎంత థాంక్ ఫుల్‌ (Thankful)గా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. అయితే.. సినిమా, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ గురించి చాలా మంది స్టడీ చేసి ఉంటారు. రైటింగ్ అంటే ఇది.. క్యారక్టర్ ఆర్క్ అంటే ఇది.. ఆ సీన్ ఇక్కడ పడాలి.. అంటూ ఏదోదో మాట్లాడుతుంటారు. టెక్నికల్ రివ్యూలు ఇస్తుంటారు. అలాంటివి ఏవి నాకు తెలియదు. నాకు తెలిసిన సినిమా ఒక్కటే. థియేటర్స్‌ (Theaters)లో సినిమా నచ్చితే ఒక ఆడియన్‌గా విజిల్స్ వేస్తా.. చప్పట్లు కొడతా.. అదే నాకు తెలిసిన సినిమా.. అలాగే తీస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. ప్రజెంట్ టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిల్‌పై ‘అతను క్రింజ్ కామెడీ సినిమాలు తీస్తాడని, ‘రాడ్ పూడి’ అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ విధంగా సమాధానం చెప్పాడు అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.

Next Story