కేంద్రం సంచలన నిర్ణయం.. జీ5 నుండి దిల్జిత్ దోసాంజ్ సినిమా ‘సత్లుజ్’ తొలగింపు

by Malleboina Mahesh |   (  Updated:2026-07-07 07:02:13  IST  )

దిల్జిత్ దోసాంజ్ చిత్రం ‘సత్లుజ్’ పై కేంద్రం నిషేధం.. జీ5 (Zee5) ఓటీటీ నుండి తొలగింపు.. కంటెంట్ పరిశీలనకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు!

కేంద్రం సంచలన నిర్ణయం.. జీ5 నుండి దిల్జిత్ దోసాంజ్ సినిమా ‘సత్లుజ్’ తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్‌కు చెందిన ఒక మానవ హక్కుల కార్యకర్త అదృశ్యం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) నటించిన చిత్రం ‘సత్లుజ్’ (Satluj) వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కంటెంట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ఆదివారం ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్ ‘జీ5’ నుండి తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

కంటెంట్ పరిశీలనకు ‘ఐడీసీ’ (IDC) కమిటీ..

ఈ సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాలు, కథాంశాన్ని లోతుగా పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక ఉన్నత స్థాయి ‘ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీ’ని (IDC) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సినిమాలో చూపించిన అంశాలు, సమాజంపై వాటి ప్రభావం మరియు దేశ భద్రత/శాంతి భద్రతలకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలను పూర్తిగా సమీక్షించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ సినిమాను మళ్లీ ఓటీటీలో ప్రసారం చేయాలా? లేదా పూర్తిగా నిషేధించాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. దిల్జిత్ దోసాంజ్ నటించిన ఈ చిత్రం చుట్టూ జరుగుతున్న వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story